NTV Telugu Site icon

Tollywood: టాలీవుడ్ టాప్ అప్ డేట్స్.. ఒక్క క్లిక్ తోనే..

Untitled Design (81)

Untitled Design (81)

హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో AMB సినిమాస్ ఒకటి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నైజాం టాప్ డిస్ట్రిబ్యూటర్ఏ షియన్ సునీల్ ఈ ముల్టీప్లెక్స్ లో భాగస్వాములు. రిలీజ్ రోజు ఈ ముల్టీప్లెక్స్ లో సినిమా చూడాలని అందరి హీరోలకు కోరిక. కాగా రెబల్ స్టార్ నటించిన కల్కి సినిమాకు స్పెషల్ అఫర్ ప్రకటించింది. నేటి నుండి AMBలో కల్కి సినిమా టికెట్ ధర రూ .150 మాత్రమేనని పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది కేవలం ఆగస్టు 9 వరకు మాత్రమే అని తెలిపింది.

Also Read : Salaar: సలార్ 2 ఇప్పట్లో లేనట్లేనా.. అసలేం జరిగింది..?
తంగలాన్ ప్రమోషన్స్ లో భాగంగా నటుడు చియాన్ విక్రమ్ హైదరాబాద్ లోని పలు ఇంటర్వ్యూ లలో పాల్గొన్నాడు. ఈ దశలో సినీ జర్నలిస్ట్ లతో ఇష్టాగోష్టి నిర్వహించారు. కాగా మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో విక్రమ్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడంటూ వచ్చిన వార్తలపై ప్రశ్నించగా రాజామౌళి తనను సంప్రదించిన మాట నిజమే కానీ అది మహేశ్ సినిమా కోసం కాదు రానున్న రోజుల్లో రాజమౌళి సినిమాలో నటించే అవకాశం ఉండొచ్చేమో అని అన్నారు.

Also Read : NTR31 : తారక్ – ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ ఎప్పుడంటే..?

నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం కమిటీ కుర్రోళ్లు, ఆగస్టు 9న రిలీజ్ కానున్నఈ సినిమాకు సంబంధించి మెగా స్టార్ చిరంజీవి కమిటీ కురోళ్ళు టీమ్ ను అభినందిస్తూ ” మా నిహారిక మల్టీటాలెంటెడ్, ఆర్టిస్ట్ గానే కాకుండా ఆడియన్స్ టెస్ట్ కు తగ్గట్టుగా సినిమాలు నిర్మించడం తెలుసనీ నా నమ్మకం, నేను ఈ సినిమా చూసాను చాలా బాగుంది టాలీవుడ్ ఆడియన్స్ కొత్త తరహా కథలను ఆదరిస్తారు, మీ అందరికి ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.

Show comments