NTV Telugu Site icon

Tollywood : ఈ ఏడాది టాలీవుడ్‌ను పలకరించని బ్యూటీల లిస్ట్ పెద్దదే

Tollywood (2)

Tollywood (2)

ఒకప్పటి స్టార్ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌ను పలకరించి ఏడాది దాటిపోయిందన్న సంగతి వారికయినా గగుర్తుందో లేదో.  వారిలో కొంత మంది భామలు బాలీవుడ్ చెక్కేస్తే.. మరికొంత మంది కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ఇంతలా తెలుగు ఆడియన్స్‌తో ఏడాది కాలంగా గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్న ఆ బ్యూటీస్  లో మొదటి స్తానంలో ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈమె తెలుగు సినిమా చేసి ఏడాది దాటేస్తోంది. రకుల్, నిత్యామీనన్ వంటి సీనియర్ స్టార్ భామలది కూడా ఇదే దారి. రకుల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయితే కేరళ కుట్టీ నిత్యా తమిళంపై ఫోకస్ పెంచింది. అనుష్క ఘాటీతో నెక్స్‌ ఇయర్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Also Read : Vikatakavi: వెబ్ సిరీస్‌కు వ‌ర్క్ చేయ‌టం ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్ : జోశ్యుల‌ గాయ‌త్రి

సీనియర్ ముద్దుగుమ్మలను పక్కన పెడితే యంగ్ భామలు కూడా ఏడాదిగా తెలుగు ఇండస్ట్రీని వంగి తొంగి చూడటం లేదు. భోళా శంకర్ బెడిసి కొట్టిన తర్వాత మహానటి కీర్తి సురేష్ కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చింది తప్ప నటించలేదు. కానీ బేబీ జాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. పొగుడుకాళ్ల సుందరి పూజా, రాశీ ఖన్నాలు టాలీవుడ్ ను ఎప్పుడో దూరం జరిగారు. రాధే శ్యామ్ తర్వాత పూజా పూర్తిగా దూరమైంది. రాశీ మాత్రం సిద్దుతో తెలుసు కదాలో రొమాన్స్ చేస్తోంది. ఇక తమ్ము టాలీవుడ్ లో చేయడమే మానేసింది. మరోవైపు అప్ కమింగ్ భామలు సంయుక్త మీనన్, భాగ్యశ్రీ వరుసగా టాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. ఈ స్టార్ భామలుఈ గ్యాప్ మర్చిపోయేలా గట్టి కంబ్యాక్ ఇస్తే ఓకే కానీ లేకుంటే ఆడియన్స్, ఫ్యాన్స్ లైట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అందమైన భామలు బీ కేర్ ఫుల్ సుమీ.

Show comments