తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోలలో చియాన్ విక్రమ్ ఒకరు. అప్పట్లో బాల దర్శకత్వంలో వచ్చిన తమిళ్ తో పాటు తెలుగులోను మంచి విజయం దక్కించుకుంది. ఆ తర్వాత భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు’ విక్రమ్ మార్కెట్ ను తెలుగులో అమాంతం పెంచింది. ఆ తర్వాత విక్రమ్ సినిమాలు వరుసగా టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించాయి కానీ అవేవి హిట్ అవ్వలేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ మాత్రం బెస్ట్ ఓపెనింగ్ రాబట్టింది.
Also Read: Devara: దేవర థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ దర్శకుని కుమారుడు.. ఎవరంటే..?
విక్రమ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘తంగలాన్’. అణగారిన వర్గాల పట్ల జరిగే వివక్షను ప్రశించే విధంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పా.రంజిత్ తంగలాన్ కు దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని విక్రమ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను మెప్పించింది. అదే విధంగా ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదల కాగా సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఆగస్టు 15న విడుదల కానున్న తంగలాన్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్, ఈ నేపథ్యంలో తెలుగులో ఓ భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో రేపు సాయంత్రం 6:00గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర హీరో చియాన్ విక్రమ్, దర్శకుడు పా. రంజిత్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. భారీ అంచనాల మధ్య కేజీఎఫ్ గోల్డ్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని రూ. 100 కోట్లతోగ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించగా, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను మైత్రీ మూవీస్ కొనుగోలు చేసింది.