Tollywood : టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమ రేంజ్ ఇప్పుడు కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్‌కు టాలీవుడ్ ఎదిగింది. ఈ క్రమంలోనే రాబోయే కాలంలో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసేందుకు అత్యంత భారీ బడ్జెట్, హై-వోల్టేజ్ క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. ముఖ్యంగా రాబోయే కాలంలో థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు సిద్ధమవుతున్న కొన్ని మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రాలు వాటిపై ఉన్న భారీ అంచనాల విశేషాలు ఇవే..
ఫౌజీ : రెబల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న పీరియడ్ ఆర్మీ యాక్షన్ డ్రామా ఫౌజీ. 1940ల నాటి బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగనుంది. ప్రభాస్ లుక్, హను మార్క్ ఎమోషన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.
Also Read
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
స్పిరిట్ : ‘యానిమల్’ చిత్రంతో బాక్సాఫీస్‌ను వణకించిన సాండీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబోలో రాబోతున్న రికార్డ్ బ్రేకింగ్ ప్రాజెక్ట్. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్ అండ్ రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. సందీప్ మార్క్ వైల్డ్ యాక్షన్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
వారణాసి : టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో గ్లోబల్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం. దాదాపు రూ. 1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ హాలీవుడ్ రేంజ్లో ఉండబోతోందని టాక్.
డ్రాగన్ పార్ట్ 1 : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న బ్లడ్ సోక్డ్ యాక్షన్ సాగా డ్రాగన్. ఉగ్రం, కేజీఎఫ్, సలార్ లాంటి హై-వోల్టేజ్ ఎలివేషన్లతో మతిపోగొట్టే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ను ఏ రేంజ్ డ్రాగన్‌లా చూపించబోతున్నాడో అని మాస్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
రాకా & ఓజీ 2 : అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్క్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రాకా. సన్ పిచ్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ సీక్వెల్స్ పై కూడా భారీ హైప్ నెలకొంది.
ఈ చిత్రాలన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!