Kollywood : నిత్యామీనన్ ఇక నుండి తమిళ డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ఆడియన్స్‌ను పలకరించేట్లు కనిపిస్తోంది. బీమ్లానాయక్, శ్రీమతి కుమారితో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దూరంగా ఉన్న మేడమ్.. తిరుచిత్రాంబలం డబ్బింగ్ వర్షన్ తిరుతో హాయ్ చెప్పింది. తెలుగులో ఇప్పటి వరకు కొత్త సినిమాకు సైన్ చేయని భామ మరోసారి తమిళ్ మూవీతోనే పలకరించనుంది. తలైవన్ తలైవిని తెలుగులోకి సార్ మేడమ్‌తో డబ్ చేయబోతున్నారు. ఆ వెంటనే ఇడ్లీ కడాయ్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల ర్యాపోకు రెడీ అయ్యింది నిత్య.
Tollywood : కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్యల లాంటి ఫీల్ గుడ్ మూవీలను నిర్మించిన ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి తెరకెక్కించిన చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు. రానా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. జులై 18న థియేటర్లలోకి రాబోతుంది మూవీ. గత రెండు చిత్రాల మాదిరిగానే ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
Bollywood : కన్నప్పతో యూత్ గుండెల్ని గత్తర లేపిన ప్రీతి ముకుందన్ మాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. మైనే ప్యార్ కియా అనే రొమాంటిక్ కామెడీ చేస్తోంది ఈ నెమలి. హిద్రూ హరూన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు ఫైజల్ ఫజీలుద్దీన్ దర్శకుడు. ఆగస్టు 29న బొమ్మ థియేటర్లలోకి రాబోతుంది. ఓనమ్ పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్.
