Site icon NTV Telugu

Tollywood: జస్ట్ ఒక క్లిక్ తో.. టాలీవుడ్ టాప్ 3 అప్ డేట్స్

Untitled Design 2024 08 15t142328.938

Untitled Design 2024 08 15t142328.938

నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ రోజు సాయంత్రం స్పెషల్ ప్రీమియర్స్ తో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. రెండు తెలుగు రాష్టాలలో ఈ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. చిన్న సినిమాగా రానున్న ఆయ్ కు ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది.

Also Read: NBK50 inTFI : ఒకే వేదికపై చిరు – బాలయ్య.. ఫ్యాన్స్ కు పూనకాలే..

కెరీర్ తొలినాళ్లలో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం గీతగోవిందం. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించడమే కాకుండా విజయ్ దేవరకొండను ఫామిలీ అడియన్సుకి దగ్గర చేసింది. ఈ సినిమా విడుదలై నేటికీ సరిగ్గా 6సంవత్సరాలు అయిన సందర్భంగా ఫ్యాన్స్ మరోసారి ఈ సినిమాను గుర్తుచేసుకుంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Rajni : తెలుగు సినిమాకు నో చెప్పిన తమిళ సూపర్ స్టార్.. కారణాలు బోలెడు..

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ఆగస్ట్ 9న రిలీజైన కమిటీ కుర్రోళ్ళు హిట్ టాక్ తెచుకుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం 6వ రోజు కూడా బుక్ మై షో లో 13K పైగా టికెట్స్ బుకింగ్స్ ఔరా అనిపించింది. బి, సి సెంటర్స్ లో కూడా కమిటీ కుర్రోళ్ళు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు రాబట్టింది.

Exit mobile version