గ్లోబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కోసం సరికొత్త లుక్ ట్రై చేసి పాన్ ఇండియా రేంజ్‌లో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాడు.. మారుతి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రభాస్ మాస్ అటిట్యూడ్, థియేటర్స్‌లో భయపెట్టి నవ్వించి హంగామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. రాజాసాబ్‌లో కొత్త గెటప్, రాయల్ లుక్‌తో సింహాసనం మీద కూర్చున్న ప్రభాస్ ఈసారి ఫ్యాన్స్ విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి డిసెంబర్ 5న రెడీ అవుతున్నాడు.అయితే ప్రొడ్యూసర్ మాత్రం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామంటున్నాడు. ఈ కన్‌ఫ్యూజన్‌పై క్లారిటీ రావడానికి డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.
ప్రేమ, పోరాటం పాత్ర ఏదైనా ఆడియెన్స్‌ని ఫిదా చేస్తున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ మధ్య తను చేస్తున్నన ప్రతి సినిమాలో స్టోరీతో పాటు లుక్ కూడా డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాడు. ప్రజెంట్ చేస్తున్న ది ప్యారడైజ్ మూవీలో రెండు జడలతో కంప్లీట్ ఛేంజోవర్‌తో హడలెత్తిస్తున్నాడు. రామోజి ఫిలిం సిటీలో 15 రోజుల పాటు జైలు సీక్వెన్స్ షూట్ చేశారు. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఆడియెన్స్ నుంచి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో మార్చి 26న ఈ మూవీ థియేటర్‌లో సందడి చేయనుంది.
మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ అండ్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్‌లలో సత్యదేవ్ ఒకరు. బ్లఫ్ మాస్టర్‌తో తన నటనకి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. రీసెంట్‌గా జీబ్రా సినిమా తో మరోసారి ఆకట్టుకున్నాడు సత్యదేవ్. తను నుంచి వస్తున్న న్యూ మూవీ రావు బహుదూర్. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమా కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అనుమానం పెనుభూతం అనే టాగ్ లైన్‌ని హైలైట్ చేస్తూ డిఫరెంట్ స్టోరీ లైన్‌తో ఈ మూవీ నిర్మాణం జరుపుకుంటోంది. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా తర్వాత వెంకటేష్ మహా, సత్యదేవ్ కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తోంది.“రావు బహదూర్” వెరైటీ టైటిల్‌తో వస్తోన్న ఈసినిమాలో డిఫరెంట్ గా సరికొత్త మేక్ ఓవర్‌తో కనిపించి షాకిస్తున్నాడు సత్యదేవ్.
