NTV Telugu Site icon

Tollywood: టాలీవుడ్ సూపర్ ఫ్లాష్ అప్‌డేట్స్.. ఒక్క క్లిక్ లోనే..

Untitled Design (69)

Untitled Design (69)

విశ్వక్ సేన్ హీరోగా నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మెకానిక్ రాకి’. ఇటీవల విడుదలైనా ఈ చిత్ర ట్రైలర్ యూత్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. అత్యంత భారీ బడ్జెట్ లో SRT బ్యానర్ పై నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఆగస్టు 7న సాయంత్రం 4:04 గంటలకు రిలీజ్ చేస్తామని అధికారకంగా ప్రకటించారు.

Also Read : Pushpa: పుష్ప నుండి అదిరిపోయే అప్‌డేట్‌.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

jr.ఎన్టీయార్ బావమరిదిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన యంగ్ హీరో నార్నె నితిన్. తోలి చిత్రం MAD తో సూపర్ హిట్ సాధించాడు. ప్రస్తుతం నార్నె నితిన్ హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా “ఆయ్” సినిమాను నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించారు. అత్యంతం నవ్వులు పూయిస్తూ, కులం కాన్సెప్ట్ ఫై ఫన్నీ జోకులు వేస్తూ సరదగా సాగింది ఈ ట్రైలర్.

Also Read: Devara: సాయంత్రం సంచలనం సృష్టించబోతున్న దేవర.. మీరు రెడీనా..?

డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో రామ్ సరసన జోడిగా నటిస్తోంది కావ్య థాపర్. విశాఖలో జరిగిన ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. డబుల్ ఇస్మార్ట్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. రామ్ గారు, పూరి గారితో వర్క్ చేయడం ఒక బ్లెస్సింగ్ గా భావిస్తున్నాను. ఈ సినిమాలో పార్ట్ కావడం లక్కీగా ఫీలౌతున్నాను. ఆగస్ట్ 15 న డబుల్ ఇస్మార్ట్ బ్లాస్ట్ కాబోతోంది. మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అందరూ థియేటర్స్ లో చూడండి’ అన్నారు.

Show comments