Site icon NTV Telugu

Tollywood: ఒకే వేదికపై బావ – బావమరిది.. ఫ్యాన్స్ కు పూనకాలే..?

Untitled Design (95)

Untitled Design (95)

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ‘నార్నే నితిన్’ మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నితిన్  ‘ఆయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో రానుంది ఈ చిత్రం. ఆగస్టు 15న భారీ చిత్రాల పోటీ మధ్యలో చిన్న సినిమాగా రిలీజ్ చేయడం అవసరమా అనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ ఆయ్ ట్రైలర్ చూశాక ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా చూడాల్సిందే అనుకుంటున్నారు ఆడియన్స్. ఆయ్ ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల చూపు పడింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే పిఠాపురంలో కార్యక్రమం కూడా నిర్వహించారు.

Also Read : Akhil Akkineni : అఖిల్ లేటెస్ట్ సినిమా టైటిల్ ఇదే..ఈ సారి కూడా..?

మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిందేకు ఏర్పాట్లు చేస్తోంది నిర్మాణ సంస్థ. తాజా సమాచారం ప్రకారం ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అదే జరిగితే ఆయ్ కు అదిరిపోయే పబ్లిసిటి వస్తుంది. అటు నందమూరి ఇటు అల్లు అభిమానుల సపోర్ట్ ఫుల్లుగా ఆయ్ కు లభిస్తుంది.

Also Read : Tollywood: టాలీవుడ్ టుడే టాప్ 3 అప్ డేట్స్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే..

ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి ఫన్ స్టోరీతో రూపొందుతోన్న ‘ఆయ్’ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మిస్తున్నారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుంది. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. రామ్ మిరియాల ‘ఆయ్’ కు సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version