Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?

How Movie Theatres

How Movie Theatres

Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ వేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. రిలీజ్ కు ఒక రోజు ముందే ప్రీమియర్ వేయడమంటే గట్స్ ఉండాలి. ధైర్యం ఉంటే సరిపోదు, తమ ప్రాజెక్టుపై నమ్మకం కూడా ఉండాలి. ఇలా ఫుల్ కాన్ఫిడెన్స్ తో వస్తున్న ఆ సినిమాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాయి. ప్రీమియర్స్ లో హిట్ టాక్ వస్తే ఫస్ట్ డే కలెక్షన్స్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. పాజిటివ్ మౌత్ టాక్ తో ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ఫస్ట్ డేనే కలెక్షన్స్ వీక్ అయిపోతాయి. ప్రభాస్ తీసిన ‘ఫౌజీ’ పై మైత్రి మూవీ మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. సినిమా డిసెంబర్ 3న రిలీజ్ అవుతుంటే, ముందురోజు రాత్రి ప్రీమియర్స్ వేస్తామని నిర్మాత ప్రకటించారు. ప్రీమియర్స్ ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుంది. వారికి పుష్ప 2 లాంటి సినిమాల అనుభవం కూడా ఉండడం కలిసొచ్చే అంశం.

ప్రభాస్ లాస్ట్ మూవీ ‘రాజా సాబ్’ ప్రీమియర్స్ ని సరిగ్గా యూస్ చేసుకోలేదు. అర్ధరాత్రి వరకు బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో నిర్మాత 20 కోట్లు నష్ట పోయారు. ఈ ఎక్స్పీరియన్స్ తో మైత్రి మూవీ మేకర్స్ ఫౌజీ ప్రీమియర్స్ ని ఎలా ప్లాన్ చేస్తుందో చూడాలి. నాని ‘పారడైజ్’ కూడా ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతోంది. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించకపోయినా, సెప్టెంబర్ 24న రిలీజ్ చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారు. 23న ప్రీమియర్స్ తో రిలీజ్ కు ప్రయత్నిస్తున్నారు. టీజర్ ను ఈ నెల 8న రిలీజ్ చేస్తున్నారు. నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో పారడైజ్ రూపొందింది. సినిమా 150 కోట్లు దాటుతుందన్న వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.