Site icon NTV Telugu

Tollywood 2025: ఇవానా టు అనస్వర.. ఈ ఏడాది టాలీవుడ్‌లో మెరిసిన మాలీవుడ్ బ్యూటీస్!

Malayalam Actresses Tollywood

Malayalam Actresses Tollywood

బాలీవుడ్ తర్వాత మాలీవుడ్ భామలపై ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తూ ఉంటుంది టాలీవుడ్. ఊ అంటే.. మాలీవుడ్ హీరోయిన్లను పట్టుకొచ్చి లైఫ్ ఇస్తుంటారు మన ఫిల్మ్ మేకర్స్. ప్రతి ఏడాది లాగానే ఈ ఇయర్ కూడా నయా కేరళ కుట్టీలు టాలీవుడ్‌లోకి లక్ టెస్ట్ చేసుకునేందుకు వచ్చారు. ఆ హీరోయిన్స్ ఎవరు?, ఎంత మంది సక్సెస్ అందుకున్నారో చూద్దాం.

ఇవానా:
ఈ ఏడాది కూడా మాలీవుడ్ హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ తలుపు తట్టారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఇవానా. ‘లవ్ టుడే’తో డైరెక్ట్‌గా తమిళ ఆడియన్స్‌కు చేరువై.. డబ్బింగ్ వర్షన్‌తో మనకు పరిచయమైంది ఇవానా. ఈ సక్సెస్ ఆమెకు టాలీవుడ్ అవకాశాలను తెచ్చిపెట్టాయి. శ్రీవిష్ణు ‘సింగిల్’ మూవీతో తెలుగులో డెబ్యూ ఇచ్చిన ఇవానా.. సాలిడ్ హిట్ అందుకుంది.

మాళవిక మనోజ్:
జోతో పాపులరైన మలయాళ కుట్టీ మాళవిక మనోజ్.. సుహాస్‌ మూవీ ‘ఓ భామ అయ్యోరామ’తో టాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలనుకున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ కోలీవుడ్, మాలీవుడ్ చెక్కేసింది.

దర్శనా రాజేంద్రన్:
దర్శనా అంటూ మలయాళీ యూత్ హృదయాలను కొల్లగొట్టిన దర్శనా రాజేంద్రన్.. ‘పరదా’తో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుందామని ప్రయత్నిస్తే బొమ్మ అండర్ ఫర్ఫామెన్స్ చేసింది. దాంతో ఆమె ఆశలు గల్లంతు అయ్యాయి.

అనస్వర రాజన్:
ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులతో టచ్‌లోకి వచ్చిన మరో మలయాళ సోయగం అనస్వర రాజన్. ‘ఛాంపియన్‌’తో మెరిసిన అనశ్వర.. కట్టుబొట్టుతోనే కట్టిపడేసింది. అనస్వరకు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం పక్కా. యువ హీరోలకు ఆమె మంచి చాయిస్ అనే చెప్పాలి.

మాళవిక మోహనన్:
ఇక అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. మరో కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ కూడా ఈ ఏడాదే రాజా సాబ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేదే. కానీ బొమ్మ నెక్ట్స్ ఇయర్ పోస్ట్ పోన్ కావడంతో డెబ్యూ డిలే అవుతోంది. ఈ నలుగురు భామల్లో ఇవానా, అనస్వర హిట్ కొడితే.. మాళవిక, దర్శనా ఫ్లాప్స్ చూశారు. ఏదేమైనా ఈ నలుగురు టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.

Exit mobile version