Site icon NTV Telugu

Tollywood : సెప్టెంబర్ 19న చిన్న సినిమాల జాతర

Tollywood (1)

Tollywood (1)

సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రాక నేపథ్యంలో ఈ ఫ్రైడే డల్లుగా ఉండొచ్చు.. మిరాయ్, కిష్కింద కాండలే హవా కంటిన్యూ చేస్తాయి అనుకుంటే.. ఈ వారం మేము ఛాన్స్ తీసుకోబోతున్నాం అంటూ వచ్చేస్తున్నాయి కొన్ని సినిమాలు. సుమారు ఆరేడు సినిమాలు రాబోతున్నాయి. మంచులక్ష్మీ, మోహన్ బాబు నటిస్తూ.. నిర్మించిన ఫిల్మ్ దక్ష. అగ్ని నక్షత్రం నుండి దక్షగా పేరు మార్చుకున్న ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 19నే థియేటరల్లోకి రాబోతుంది.

Also Read : Rashmika : టాలీవుడ్ కన్నా బాలీవుడ్‌లో రష్మికకు భారీ డిమాండ్

రీసెంట్ టైమ్స్‌లో లవ్ స్టోరీలకు మంచి ఆదరణ లభిస్తుంది. మొన్న తండేల్, నిన్న లిటిల్ హార్ట్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు మరో ప్రేమ కథా చిత్రం బ్యూటీ ఈ ప్రైడేన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంకిత్ కొయ్య, నీలకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నరేష్, వాసుకి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. రీసెంట్లీ రిలీజైన ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఇక వీటితో పాటు స్వర్ణ కమలం ఇన్పిరేషన్‌తో తెరకెక్కుతోన్న అందెల రవమిది ఫిల్మ్ సెప్టెంబర్ 19నే రిలీజవుతోంది. ఇంద్రాణి దావులూరి ఫీమేల్ లీడ్ కాగా, నిర్మాత, దర్శకురాలిగా కూడా వ్యవహరించారు. ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసి ఉండరు అనే ఫిల్మ్ కూడా ఈ ఫ్రేడేనే టెస్టింగ్‌కు రెడీ అవుతోంది. ఈసినిమాను మైత్రీ మూవీమేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం.

వీటితో పాటు మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు దండయాత్రకు రెడీ అయ్యాయి.  టాలీవుడ్‌లో మార్కెట్ ఏర్పాటు చేసుకున్న విజయ్ ఆంతోనీ… తన 25వ ఫిల్మ్ భద్రకాళితో వచ్చేస్తున్నాడు. ఇక డీఎన్ఎతో డీసెంట్ హిట్ అందుకున్న అధ్వర్య ఫిల్మ్ తనల్.. ఇప్పుడు తెలుగులో టన్నెల్ పేరుతో రిలీజ్ అవుతోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 19నే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రవి బస్రూర్ దర్శకుడి మారి మెగాఫోన్ పట్టిన వీర చంద్ర హాస కన్నడలో ఎప్పుడో రిలీజ్ చేయగా  ఇప్పుడు తెలుగులో తీసుకు వస్తున్నారు. మరీ ఇన్ని చిత్రాల్లో ఈ శుక్రవారం ఎవరిదో.. లేక మిరాయ్, కిష్కింద కాండలదే ఈ ఫ్రైడే కూడా కాబోతుందో వీకెండ్‌లో తేలిపోతుంది.

Exit mobile version