2025లో భారీ అంచనాల మధ్య థియేటర్లలో అడుగుపెట్టిన అనేక పాన్ ఇండియా సినిమాలు, బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన విషయం తెలిసిందే. వాటిలో అత్యంత విఫలమైన సినిమాగా కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘థగ్ లైఫ్’ నిలిచింది. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కేవలం పదుల కోట్ల వసూళ్లకే పరిమితమైంది. ఈ ఫెయిల్యూర్‌తో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి రూ.150 కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ మూవీ జూన్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా 4917 స్క్రీన్లలో విడుదల అయ్యింది. కమల్ హాసన్ అభిమానుల్లో భారీ హైప్ ఉన్నప్పటికీ, మొదటి రోజు వసూళ్లు కేవలం రూ.15.5 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి.
Also Read : Anupama : అనుపమ పరమేశ్వరన్ సినిమాకు సెన్సార్ షాక్..
ఇక కమల్ హాసన్ తన 70 ఏళ్ల వయసులోనూ శక్తివేల్ పాత్రలో అద్భుతంగా నటించారని విమర్శకులు ప్రశంసించాగా. శింబు కూడా యాక్టింగ్‌లో అస్సలు తగ్గలేదు. కానీ అతని పాత్రకు స్క్రీన్ టైమ్, డెప్త్ లేకపోవడంతో పూర్తిగా ప్రభావం చూపలేకపోయాడు. ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వంటి టెక్నికల్ యాస్పెక్ట్స్ ఉన్నా, స్టోరీలో బలం లేకపోవడం వాటన్నింటినీ వెనక్కి నెట్టింది. ఆరు రోజుల్లో సగానికి పైగా స్క్రీన్స్ తగ్గిపోయాయి. థియేటర్లలో ఈ సినిమా ఎనిమిది వారాలు ఆడాలని ప్లాన్ చేసినప్పటికీ, నాలుగు వారాల్లోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా కర్ణాటకలో రిలీజ్ అవ్వకపోవడం మరో మైనస్. అలా మొత్తంగా ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ నిర్మాతలకు రూ.150 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చింది. దీని బట్టి 2025 లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ అంటే ‘థగ్ లైఫ్’ ..