కాంతార కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది కాంతార. ఇప్పడు కాంతార కు ప్రీక్వెల్ గా కాంతార చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు. కాంతార బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రాబోతున్న కాంతార చాప్టర్ 1పై హోంబలే భారీగా ఖర్చు పెడుతోంది.
Also Read : Pongal Race : సంక్రాంతి బరిలో రమణగాడి మరదలు.. గర్ల్ ఫ్రెండ్..
కాగా కాంతార చాప్టర్ 1 సినాప్సిస్ నెట్టింట వైరల్ అయ్యాయి. దాన్ని బట్టి చుస్తే ఈ సినిమా 2022 సంచలన సంఘటనలకు చాలా కాలం ముందు, ఒక పురాణం పుట్టింది. కదంబ రాజవంశం పాలనలో 300 CEలో జరిగిన కాంతార: చాప్టర్ 1 ప్రేక్షకులను బనవాసిలోని ఆధ్యాత్మిక అడవులలోకి తీసుకెళుతుంది. అక్కడ దైవిక ఆత్మలు మేల్కొంటాయి మరియు దైవ సంప్రదాయం యొక్క మూలాలు నకిలీ చేయబడతాయి. అపుడు రిషబ్ శెట్టి ఒక భయంకరమైన నాగ సాధువుగా రూపాంతరం చెందుతాడు, మానవులకు మరియు దైవికానికి మధ్య వారధిగా మారడానికి ఉద్దేశించిన యోధుడుగాను ఆధ్యాత్మికవేత్తగాను మారతాడు. పురాతన ఆచారాలు, అతీంద్రియ శక్తులు మరియు గిరిజన పోరాటాలు మరెక్కడా లేని విధంగా సినిమాటిక్ దృశ్యంలో చూపించబోతున్నారు. కాంతార: చాప్టర్ 1 ఇది కేవలం ప్రీక్వెల్ కాద ఇది ఒక పురాణం యొక్క మూలం. అంతకు మించి ఇదోక విజువల్ వండర్ అని సమాచారం. రిషబ్ శెట్టి నటన సినిమాకె హైలెట్ గా నిలుస్తుందట. భారీ అంచనాలు భారీ బడ్జెట్ పై వస్తున్న కాంతార చాప్టర్ 1అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.