Site icon NTV Telugu

Tollywood : టాలీవుడ్ లో ఆ హిట్ పెయిర్స్‌కు ఓ స్పెషల్ క్రేజ్.

Hit Pair

Hit Pair

ఓ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌటై.. ఆడియన్స్ నుండి అప్లాజ్ తెచ్చుకున్న జంటను హిట్ పెయిర్‌గా కన్సిడర్ చేస్తుంది ఇండస్ట్రీ. 90స్ నుండి చూస్తే చిరంజీవి- రాధ, బాలకృష్ణ- విజయ్ శాంతి, నాగార్జున- రమ్యకృష్ణ, వెంకటేశ్- సౌందర్య/మీనాల జోడీని హిట్ పెయిర్‌గా చూస్తుంది టాలీవుడ్. ఇక రీసెంట్ టైమ్స్‌లో ప్రభాస్- అనుష్క, చరణ్- కాజల్, నాగ చైతన్య- సామ్, విజయ్ దేవరకొండ- రష్మికను ఆన్ స్క్రీన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా భావించారు టాలీవుడ్ ఆడియన్స్. రీసెంట్లీ చైతూ, సాయి పల్లవి జోడీ హిట్ పెయిర్‌గా మారింది. ఈ పెయిర్స్ కలిసి నటిస్తున్నారంటే సినిమాపై బజ్, హైప్ క్రియేట్ అవుతోంది.

Also Read : Allu Aravind : సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ కి తెలిసినంతగా ఎవరికి తెలియదు

టాలీవుడ్‌లో కొత్తందాలు, కొత్త కాన్సెప్టులు పుట్టుకొస్తున్న తరుణంలో హిట్ పెయిర్స్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడం తగ్గిపోతున్నాయి. అయినా సరే కొంత మంది మేకర్స్ మాత్రం జోడీలను రిపీట్ చేస్తూ ప్రాజెక్టుపై క్యూరియస్ కలిగిస్తున్నారు. అలాంటి పెయిర్‌లో ఫస్ట్ వరుసలో ఉంది వెంకటేశ్ అండ్ మీనా. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో సిక్స్ ఫిల్మ్స్ వచ్చాయి. ఈ ఆరు సూపర్ డూపర్ హిట్సే. ఇప్పుడు ఈ జోడీ దృశ్యం- 3 రూపంలో మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. త్వరలో ఈ బొమ్మ సెట్స్‌పైకి వెళ్లనుంది. గీతాగోవిందంతోనే హిట్ పెయిర్‌గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక.. మరోసారి కొలబరేట్ కాబోతున్నారు. డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించకపోయినా.. ఈ మూవీ మాకెంతో స్పెషల్ అంటూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు ఈ జంట. ఇప్పుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తోన్న వీడీ14 చిత్రంలో మరోసారి పెయిర్ అప్ కాబోతున్నారు. ప్రజెంట్ కింగ్డమ్‌తో బిజీగా ఉన్న విజయ్.. నెక్ట్స్ ఈ సినిమాకు షిఫ్ట్ కానున్నాడు. ఇటు రష్మిక కూడా బోలెడన్నీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 1850 బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న పీరియాడిక్ డ్రామాలో కనిపించబోతున్నారు ఈ ఆల్ట్రా మోడ్రన్ పెయిర్.

Exit mobile version