Site icon NTV Telugu

Manikandan : మళ్లీ మెగా ఫోన్ పై దృష్టి సారిస్తున్న యంగ్ హీరో

Manikandan

Manikandan

మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జే నుండి హీరో వరకు ఎదిగిన నటుడు మణికందన్. అశోక్ సెల్వన్ నటించిన పిజ్జా 2తో రైటర్ గా తెరంగేట్రం చేసిన మణి.. విక్రమ్ వేదతో బెస్ట్ డైలాగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన మణికందన్.. రజనీకాంత్ కాలాలో లెనిన్ గా కీ రోల్ చేశాడు. నయన్ తార నేత్రికన్ లో అమాయకమైన పోలీసాఫీసర్ పాత్రలో మెప్పించాడు.  మణికందన్ ను ఫుల్ లెంగ్త్ హీరోగా కన్వర్ట్ అయ్యేందుకు కారణమైంది సూర్య జై భీమ్. ఆ సినిమాలో రాజకన్ను పాత్రలో యాక్టింగ్ ఇరగదీశాడు మణికందన్.

Also Read : Ram Charan : RC 16 ను జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న బుచ్చిబాబు

కానీ సడెన్లీ యూటర్న్ తీసుకుని నరాయ్ ఎజుదుమ్ సూయసరిదంతో డైరెక్టర్ అయ్యాడు. అంతలో హీరోగా ఛాన్సులు రావడంతో మెగాఫోన్ కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. గురక వల్ల ఫ్యామిలీ లైఫ్ ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకుందో చూపించిందే గుడ్ నైట్. ఆ నెక్ట్స్ వచ్చిన లవర్ కూడా మంచి వసూళ్లను రాబట్టుకొంది. రీసెంట్లీ కుటుంబస్తాన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఆకట్టుకున్నాడు మణి. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ రావడంతో మణికందన్ హ్యాట్రిక్ హిట్ ఖాతాలో వేసుకున్నట్టైంది. ఈ హిట్స్ వచ్చాక హీరోగా బిజీగా మారడం కామన్. కానీ జస్ట్ ఫర్ ఛేంజ్ అంటూ మరోసారి మెగాఫోన్ పట్టుకునేందుకు కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడట. ఓ కథ రాసుకుని విజయ్ సేతుపతికి వినిపించినట్లు టాక్. మక్కల్ సెల్వన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version