2015లో సూర్య వర్సెస్ సూర్యతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు కార్తీక్ ఘట్టమనేని. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కొట్టినా మళ్లీ సినిమాటోగ్రాఫర్‌గానే కంటిన్యూ అయ్యాడు. తిరిగి మెగాఫోన్ పట్టేందుకు సుమారు తొమ్మిదేళ్లు పట్టింది. రవితేజను డైరెక్ట్ చేసిన ఈగల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది. ఆ టైంలో కార్తీక్‌కు దర్శకుడిగా సెట్ కాలేడన్న మాటలు వినిపించాయి. కానీ ఈసారి పక్కా కథతో సెంట్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మిరాయ్ చిత్రాన్ని తీసుకు రాబోతున్నాడు. హనుమాన్ నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నుండి వస్తోన్న నెక్ట్స్ ఫిల్మ్ మిరాయ్.
Also Read : RAGADA 4K : రగడ రీ రిలీజ్.. డిజాస్టర్ బుకింగ్స్.. ఆపండి ఇకనైన
ట్రైలర్ విజువల్ వండర్‌గా.. ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అశోకుడి తొమ్మిది పుస్తకాల చుట్టూ తిరిగే ఓ కథను, తల్లి ఆశయం కోసం ఓ కొడుకు ఎంత వరకు వెళ్లాడో చూపించబోతున్నాడు కార్తీక్ ఘట్టమనేని. హనుమాన్ స్టోరీలా మైథాలజీ టచ్ ఇస్తున్నాడు. ఈ సినిమా కోసం ఐదేళ్లుగా కష్టపడ్డాడట కార్తీక్. ఇప్పటికే డీఓపీగా మంచి పేరున్న కార్తీక్ థర్డ్ డైరెక్షనల్ మూవీ మిరాయ్‌పై.. ట్రైలర్‌తో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీగా ప్లాన్ చేస్తుంది. నార్త్ టూ సౌత్ బిగ్ ప్రొడక్షన్ హౌస్‌లను రంగంలోకి దింపింది. హిందీలో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, కన్నడలో హోంబల్ ఫిల్మ్స్, తమిళంలో ఏజీఎస్, మలయాళంలో శ్రీ గోకులం మూవీస్ రిలీజ్ చేయబోతున్నాయి. కార్తీక్ ఘట్టమనేనికి మిరాయ్ హిట్ చాలా కీలకం. టీజర్, ట్రైలర్‌తో ఇంట్రస్ట్ క్రియేట్ చేయగలిగిన డైరెక్టర్ హిట్ కొడితే స్టార్ హీరోలు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా సినిమాటోగ్రాఫర్ గా మిగులుతాడు.
