ఎవరూ ఊహించని విధంగా, రీసెంట్ గా రాజ్ బి. శెట్టి సినిమా ‘రుధిరం’ కన్నడ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ 2024లో మలయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను మలయాళంలో రైటర్, డైరెక్టర్ జె ఎల్ ఆంటోని తెరకెక్కించాడు. రాజ్ బి శెట్టి కన్నడలో సక్సెస్ ఫుల్ రైటర్ కమ్ డైరెక్టర్ సు ఫ్రమ్ సో సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా, రాజ్ బి శెట్టి సినిమాటిక్ విజన్, కథ చెప్పే విధానం ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. అయితే మలయాళ సినిమా రుధిరంలో హీరోగా ఓ విభిన్న పాత్రలో కనిపించి అందర్నీ షాక్ కి గురిచేశాడు. ఈ సినిమా హెవీ యాక్షన్ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చి ఆకట్టుకుంది. రక్తపాతంతో కూడిన పోరాటాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఇంకా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. అపర్ణ బాలమురళి ఫీమేల్ లీడ్ చేసింది. అయితే ఈ రుధిరం సినిమాకి 4 గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం.
Also Read : Allari Naresh : అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’.. కిక్ ఎక్కేలా ఉంది
రాజ్ బి. శెట్టి అంటే, మనకి ‘గరుడ గమన వృషభ వాహన’ గుర్తుకొస్తుంది. ఆ సినిమాలో ఆయన నటన ఎంత భిన్నంగా ఉంటుందో చూశాం. ఒక సాధారణ మనిషిలో ఉన్న అసాధారణమైన ఆవేశాన్ని ఆయన ఆ పాత్రలో చూపించారు. ఇప్పుడు ‘ కన్నడలో రిలీజ్ కానున్న మలయాళ రుధిరంలో కూడా ఆయన అదే విధమైన ఇంటెన్సిటీతో కనిపించాడు. హీరో అనగానే అందంగా ఉండాలనే నియమాన్ని బ్రేక్ చేసి, కేవలం నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకోగలనని ఆయన నిరూపించాడు. ఆయన పాత్రలు సహజంగా, బలంగా ఉంటాయి. ఒకప్పుడు తమిళ దర్శకుడు కె.భాగ్యరాజ్, అలాగే చేరన్ తమ సినిమాల్లో హీరోలుగా నటించి ట్రెండ్ సెట్ చేశారు. హీరో అంటే ఆరడుగుల ఆజానుబాహువుడు అయి ఉండాల్సిన అవసరం లేదని, కథకు తగ్గట్టుగా ఏ నటుడైనా హీరో అవ్వచ్చని వీరు నిరూపించారు. ఇప్పుడు రాజ్ బి. శెట్టి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ప్రస్తుతం 45 అనే కన్నడ మూవీలో శివరాజ్ కుమార్, ఉపేంద్ర తో పాటు రాజ్ బి శెట్టి వన్ ఆఫ్ డి లీడ్ లో కనిపించనున్నాడు. ఇంకా బందర్ అనే సినిమా రాజ్ బి శెట్టి అప్ కమింగ్ లిస్ట్ లో ఉంది. అందం కంటే కథ, నటన ముఖ్యమని నమ్ముతున్నాడు రాజ్ బి శెట్టి.
