సదరన్ ఇండస్ట్రీలో న్యూ ట్రెండ్ ఊపందుకుంటోంది. సోషియో ఫాంటసీకి మైథాలజీ టచ్ ఇస్తూ కొత్త కథలను సృష్టిస్తోంది. పురాణ, ఇతిహాసాల, జాన పద గాధలకు.. సైన్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్ జోడిస్తోంది. తెలుగులో ఈ తరహా చిత్రాలు అడపా దడపా వచ్చాయి.. కానీ ఇప్పుడు వేగం పుంజుకుంటున్నాయి. కార్తీకేయ, హనుమాన్, మిరాయ్, కల్కి2898ఏడీ, కాంతార ఈ జోనర్ మూవీస్. ఈ సోషియో ఫాంటసీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతం కావడంతో యంగ్ హీరోస్ నుండి స్టార్ హీరోల వరకు ఇలాంటి స్టోరీల వెంట పడుతున్నారు.
Also Read : Shankar : శంకర్ దర్శకత్వంలో ధనుష్.. జరిగేపనేనా?
మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ ఫిల్మ్ విశ్వంభర భారీ సోషియో ఫాంటసీ అండ్ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు వశిష్ట. రాజమౌళి చెక్కుతున్న వారణాసి భారీ సోషియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ప్రశాంత్ వర్మ- రిషబ్ శెట్టితో తెరకెక్కిస్తోన్న జై హనుమాన్, నాగ్ అశ్విన్- ప్రభాస్ కల్కి2 చిత్రాలు కూడా సైన్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలుగా రాబోతున్నాయి. నాగ బంధం ఈ కోవలోనిదే. అలాగే త్రివిక్రమ్ తెరకెక్కించాలన్న గాడ్ ఆఫ్ వార్ కూడా ఈ జోనర్ కిందకే వస్తుందని సమాచారం.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమాకు బ్రేక్
టాలీవుడ్లోనే కాదు.. కోలీవుడ్ కూడా ఈ సోషియో ఫాంటసీ చిత్రాల వైపు పరుగులు పెడుతోంది. నయనతార మూకుత్తి అమ్మన్2 మైథాలజీ టచ్ విత్ ఫిక్షన్ స్టోరీనే. సూర్య అప్ కమింగ్ ఫిల్మ్ కరుప్పు కూడా యాక్షన్ థ్రిల్లర్ కమ్ మైథాలజీ టచ్ ఉండబోతోందట. ఇక శివకార్తీకేయన్ రీసెంట్ ఎనౌన్స్ చేసిన మూవీ సెయాన్ ఈ తరహా కథేనట. సోషియో ఫాంటసీ చిత్రాలంటే భారీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ లాంటి హ్యుజ్ ఎక్సపెన్సివ్ అయినా.. రిస్క్ అని తెలిసినా కూడా మూవీ లవర్స్ కు సరికొత్త అనుభూతినిచ్చేందుకు ఈ జోనర్ చిత్రాలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్.