NTV Telugu Site icon

Game Changer : మచ్ఛా వస్తాడే.. రచ్చ చేసి పోతాడే!

Raa Macha Macha

Raa Macha Macha

మెగా పవర్ స్టార్  రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. షూటింగ్ మొదలు ఏళ్ళు కావొస్తుంది. అప్పుడెప్పుడో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి సైలెంట్ గా ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ స్టార్ యాక్టర్ SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్‌, అంజలి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read : Devara : ఏపీ / తెలంగాణ దేవర అడ్వాన్స్ సేల్స్ వివరాలు..

మరోవైపు తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తాజాగా  ఈ సినిమా గురించి కీలక ఆప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలోని  “రా మచ్ఛా మచ్చా” అంటూ సాగే సెకండ్ సింగిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ సెప్టెంబర్ 28న ప్రోమో రిలీజ్ చేస్తామని వెల్లడించారు మేకర్స్. ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారని తమన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రానున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెటుకున్నారు. IAS ఆఫీసర్ గా, పొలిటిషన్ గా రెండు పాత్రలో అలరించనున్నాడు చరణ్. క్రిస్మస్ బరిలో దిగుతున్న గేమ్ ఛేంజర్ ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.మరోవైపు ఈ సినిమా cg వర్క్ నిమిత్తం లాస్ ఏంజెల్స్ ఉన్నారు శంకర్.