Red Bag : ఆ ‘రెడ్ బ్యాగ్’ వెనుక ఉన్న రహస్యం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వైవిధ్యభరితమైన కథాంశాలతో వచ్చే సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అదే కోవలో సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రెడ్ బ్యాగ్’. మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో మంచి ఆసక్తిని రేకెత్తించగా.. తాజాగా ఈ చిత్ర అఫీషియల్ టీజర్‌ను ఏపీ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదివారం నాడు గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఒక పవర్ఫుల్ వాయిస్ ఓవర్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “లైఫ్‌లో ఇన్వైట్ చేయని గెస్టులు చాలా మంది వస్తుంటారు.. వచ్చి మన లైఫ్‌ని మార్చేస్తారు.. ఆ గెస్ట్ మనిషే అవ్వాల్సిన అవసరం లేదు.. మనల్ని పరుగెత్తించి, ఇబ్బంది పెట్టి చావు వరకు తీసుకెళ్లి వదిలిపెట్టే ఆ పిలవని అతిథి..” అంటూ సాగే డైలాగ్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కథ విషయానికి వస్తే.. నలుగురు సాధారణ అమ్మాయిల జీవితాల్లోకి ఒక ‘రెడ్ బ్యాగ్’ ప్రవేశిస్తుంది. ఆ ఒక్క బ్యాగ్ కారణంగా వారి లైఫ్ మొత్తం ఎలా తలకిందులు అయింది? అసలు ఆ రెడ్ బ్యాగ్‌లో ఏముంది? దానికి అంతర్జాతీయ మాఫియాతో ఉన్న లింక్ ఏంటి? ఆ ప్రమాదం నుండి ఆ నలుగురు యువతులు ఎలా తప్పించుకున్నారు? అనే క్రేజీ ఎలిమెంట్స్‌తో డైరెక్టర్ రవి కుమార్ ఈ టీజర్‌ను అత్యంత సస్పెన్స్‌గా కట్ చేశారు.
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు ఎంత గ్లామరస్‌గా కనిపించారో.. అంతకు మించి వయలెంట్‌గా స్క్రీన్‌పై విధ్వంసం సృష్టించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా టీజర్ ముగింపులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా నటి రాశీ ఇచ్చిన పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ హైలైట్‌గా నిలిచింది. విలక్షణ నటుడు కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?