The Raja Saab Pre-Release Event Live: ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్.. ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ మీకోసం!

  • సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజా సాబ్ రిలీజ్
  • ఈరోజు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌
  • ఎన్టీవీలో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్
The Raja Saab Pre Release Event Live

The Raja Saab Pre Release Event Live

మారుతి దర్శకత్వంలో ‘రెబల్ స్టార్’ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్‌’. కామెడీ, హారర్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

Also Read: Naga Babu: అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది.. శివాజీ కామెంట్స్‌పై నాగబాబు ఫైర్!

ది రాజా సాబ్‌ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ ఎప్పుడా? అని రెబల్ ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చేశారు. ఆ సమయం రానే వచ్చింది. ఈరోజు (డిసెంబర్ 27) భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. హైదరాబాద్ నగరంలోని కైతలాపూర్‌ గ్రౌండ్స్‌లో ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. సాయత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈవెంట్‌ లైవ్‌ను ప్రముఖ తెలుగు ఛానెల్ ‘ఎన్టీవీ’ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది. లైవ్ స్ట్రీమింగ్ కోసం ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.