The Pet Detective : ఓటీటీలోకి అనుపమ సూపర్ హిట్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ది పెట్ డిటెక్టివ్’. నవంబర్ 28 నుంచి జీ 5లో మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రణీష్ విజయన్ దీన్ని తెరకెక్కించారు. ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలో నటించటంతో పాటు నిర్మాతగానూ తొలి అడుగు వేశారు. ఇంకా ఈ చిత్రంలో వినాయకన్, వినయ్ ఫార్ట్, అనుపమ పరమేశ్వరన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ ఇతక పాత్రల్లో నటించారు.
Also Read :Jagtial: భార్య చేతిలో మరో భర్త బలి.. రోకలి బండతో కొట్టి, మెడను కత్తితో నరికి చంపిన ధర్మపత్ని!
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ఈ సినిమా కథ విషయానికి వస్తే జోస్ అలులా (ష్రాఫ్ యు దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గక కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందర గోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్టర్ అందరూ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు. కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకుంటోంది.
Also Read :Raju Weds Rambai : మెగా ఛాన్స్ కొట్టేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీం..
ఈ సందర్భంగా నిర్మాత, నటుడు ష్రాఫ్ యు దీన్ మాట్లాడుతూ ‘‘ది పెట్ డిటెక్టివ్’ సినిమా నాకెంతో ప్రత్యేకం. నటుడిగానే కాదు.. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. ప్రేక్షకులు ఏదో ఎక్కువగా ఆలోచన చేయకుండా సరదాగా, హృదయపూర్వకంగా నవ్వుకునేలా ఓ సినిమా చేయాలని భావించి చేశాం. ఇప్పుడు ఈ సినిమాకు జీ 5లో మలయాళంలో వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ వెరన్స్‌లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి రావటం ఆనందంగా ఉంది’ అన్నారు. నవంబర్ 28 నుంచి ‘ది పెట్ డిటెక్టివ్’ జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!