The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ పై నిర్మించారు. ఈ నెల 24న ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా తొలిఆట నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కాని తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టింది. రెండవ రోజునుండి డౌన్ అయిన ఈ సినిమా ఓ మోస్తరు వసూళ్లు మాత్రమే రాబడుతుంది.
అయితే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్స్ + ఓపెనింగ్ డే మంచి వసూళ్లు రాబట్టిన ప్యారడైజ్ డే 2 నుండి ఒక్కసారిగా డ్రాప్ అయింది. ఇక ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద మొదటి ఆదివారం లో అక్యుపెన్సీతో నడుస్తుంది. నార్త్ అమెరికా వ్యాప్తంగా ఉన్న 263 లోకేషన్ల నుండి డే 4 ఆదివారం ఉదయం 10:00 గంటలకు 32 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రారంభ రోజుల్లో నమోదైన జోరుతో పోలిస్తే ఈ మైక్రో నంబర్లు కలెక్షన్లలో వచ్చిన భారీ పతనాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. వీకెండ్ ప్రారంభంలో కలెక్షన్ల పరంగా జోరు చూపించినప్పటికీ, మిశ్రమ స్పందన ప్రభావం ఆదివారం వసూళ్లపై బాగా పడినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మాస్ యాక్షన్ కు దూరంగా ఉంటున్నారు. ఓవర్సీస్ లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 4.5M కు కొనుగోలు చేయగా ఇప్పటి వరకు కేవలం 2.85M మాత్రమే రాబట్టింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఫైనల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్ కు భారీ నష్టాలు తప్పేలా లేవు.
Also Read
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
తాజావార్తలు
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!