Site icon NTV Telugu

Spark of The Paradise: నాని పారడైజ్ జైలు సీక్వెన్స్ వీడియో వచ్చేసింది.. అరాచకం అంతే!

The Paradise

The Paradise

నాని హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ది పారడైజ్. గతంలో దసరా అనే సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఒక్కసారిగా కలకలం రేపింది. ఎవరూ ఊహించని పాత్రలో నాని కనిపించబోతున్నాడని అనౌన్స్‌మెంట్ వీడియోతోనే క్లారిటీ చేశారు. ఇక ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ క్లోజింగ్ వీడియో అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ వీడియో చూస్తుంటే ఒక భారీ జైల్ సీక్వెన్స్ ఫైట్ షూట్ చేసినట్లు కనిపిస్తోంది.

Also Read:Nidhhi Agerwal: తెలుగు హీరోయిన్‌కి ప్రభుత్వ వాహనం.. అసలు నిజం ఇదే!

నాని తనదైన శైలిలో ఈ పాత్ర కోసం మేకోవర్ అయినట్లుగా కనిపిస్తోంది. అలాగే, టీంకి శ్రీకాంత్ ఓదెల ఇస్తున్న ఇన్‌స్ట్రక్షన్స్ వింటుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ సీక్వెన్స్‌లో నాని వందల మంది ఫైటర్లతో ఫైట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్ పనిచేయగా, ఆయనతో పాటు కొంతమంది హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా పనిచేసినట్లు సమాచారం. మొత్తం మీద ఈ సీక్వెన్స్ మేకింగ్ వీడియో చూస్తుంటే కచ్చితంగా సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Exit mobile version