The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise : న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఏషనాగుల’ సాంగ్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తుండగా, సినిమా కథా నేపథ్యం, నాని ఊర మాస్ లుక్‌పై అనేక అనుమానాలు, చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో సినిమాలో ‘బిర్యానీ’ అనే కీలక పాత్ర పోషించిన నటుడు సంపూర్ణేష్ బాబు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాని ఫస్ట్ లుక్ నుంచి అందరినీ అమితంగా ఆకర్షిస్తున్న అంశం ఆయన జడలు. ఆ జడల వెనుక ఉన్న కథ ఏంటన్న ప్రశ్నకు సంపూ సమాధానమిస్తూ.. “నాని గారి పాత్రకు ఆ జడలు ఎందుకున్నాయి అనే దాని వెనుక సినిమాలో చాలా పెద్ద ట్విస్టులు ఉన్నాయి.
అసలు ఆ పాత్ర నేపథ్యం ఏంటి? ఎందుకు అంత పెద్ద తిరుగుబాటు వచ్చింది? తల్లి-కొడుకుల మధ్య అంత బలమైన ఎమోషన్ ఎందుకు రగిలింది? అనే విషయాలు తెరపై చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది” అని పేర్కొన్నారు. సినిమా నేపథ్యం పీరియడ్ డ్రామానా లేక తెలంగాణ పల్లెటూరి కథా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ 24 వరకు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు. సినిమా ఔట్‌పుట్‌పై పూర్తి ధీమా వ్యక్తం చేసిన సంపూ.. ప్రేక్షకులు ప్యారడైజ్ బిర్యానీ తిన్నప్పుడు ఎంత తృప్తిగా ఫీలవుతారో, ఈ సినిమా చూశాక అంతకు డబుల్ హ్యాపీగా థియేటర్ల నుంచి బయటకు వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రతి పాత్ర నుంచి తాను అనుకున్న ఎమోషన్, యాక్టింగ్ వచ్చేంత వరకు నటీనటులతో ప్రాణం పెట్టి పని చేయించారని చెప్పారు. కేవలం పాటలు, మాస్ ఎలివేషన్లు మాత్రమే కాకుండా, బలమైన కథ, గుండెల్ని పిండేసే ఎమోషన్లతో ఈ చిత్రం రాబోతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా నాని క్యారెక్టరైజేషన్, ఆయన లుక్ వెనుక ఉన్న అసలు మిస్టరీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
తాజావార్తలు
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..