Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఖ్యాతి గ్లోబల్ స్థాయికి చేరుకుంటున్న తరుణంలో.. ఆ స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించేందుకు సిద్ధమైంది **‘ది మానిటి.ఇన్’ (The Manity.in). వందల కోట్లు కాదు, ఏకంగా వేల కోట్ల బాక్సాఫీస్ వసూళ్లే లక్ష్యంగా, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన విజువల్ వండర్‌గా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని టీం ప్రకటించింది. వీఎఫ్ఎక్స్ (VFX) రంగంలో అనుభవం ఉన్న డైరెక్టర్ బీఎస్ రావు, భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని రీతిలో, అచ్చం హాలీవుడ్ మేకింగ్ స్టైల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సాధారణంగా ఐమాక్స్ కెమెరాలను హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలకు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తుంటారు. దర్శకధీరుడు రాజమౌళి లాంటి వారే ఐమాక్స్ ఫార్మాట్‌ను వాడటానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే, తన మొదటి సినిమాతోనే టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా ‘IMAX 8K’ ఫార్మాట్‌ను పరిచయం చేస్తూ బీఎస్ రావు సాహసం చేస్తున్నారని టీం ప్రకటించింది. టెక్నాలజీ పరంగా ఏమాత్రం రాజీ పడకుండా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే సంకల్పంతో ప్రతి ఫ్రేమ్నూ ఓ విజువల్ పోయెట్రీలా తీర్చిదిద్దనున్నారని చెబుతున్నారు.
“మానవత్వం (Humanity) విఫలమైనప్పుడు ‘మానిటీ’ (MANITY) ఏం చేస్తుంది?” అనే విలక్షణమైన పాయింట్‌తో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ సాగనుంది. సమాజంలో మానవ విలువలు పతనమైనప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఎలా స్పందిస్తుందనే సోషల్ ఎలిమెంట్స్‌ను ఇందులో అద్భుతంగా చూపించబోతున్నారు. హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్‌ను మన తెలుగు హీరోలతోనే సాధ్యం చేసి చూపిస్తానని డైరెక్టర్ బీఎస్ రావు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఏ స్టార్ హీరోకైనా ఇట్టే సరిపోయేలా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథను సిద్ధం చేశారు. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించినట్లు, డేట్స్ కుదిరితే ఈపాటికే సినిమా పట్టాలెక్కేదని ఆయన తెలిపారు.
Also Read
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!