టిల్లుగాడిగా ఊరమాస్ ఫెర్మామెన్స్ చూపించిన సిద్దు జొన్నలగడ్డ డీసెంట్ లవ్ స్టోరీపై ఫోకస్ చేస్తున్నాడు. నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’కు కమిటైన ఈ కుర్రాడు క్షణం ఫేమ్ రవికాంత్ పేరేపుతో కొలబరేట్ అయ్యాడు. ఈ సినిమాకు ‘కోహినూర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. సితార ఎంటర్మైనెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్నాడు సిద్దు. ఓవైపు సెలక్టివ్ కథలను ఎంచుకుంటూ.. లైనప్స్ పెంచుకుంటున్నాడు. ఇప్పటికే చేతిలో మూడు ప్రాజెక్టులుండగా ఇప్పుడు మరొకటి చేరినట్లు టాక్ నడుస్తోంది. కోహినూర్ తెరకెక్కిస్తోన్న టీంతోనే మరోసారి కొలబ్రేట్ కాబోతున్నాడట. దీనికి బ్యాడాస్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లు టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read : Vicky Kaushal : బాలీవుడ్ రియల్ స్టార్ గా మారిన యంగ్ హీరో
ఇక టాలీవుడ్ యంగ్ హీరో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ రీసెంట్ లైలా లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని తీస్తే ప్రేక్షకులు తిప్పికొట్టారు. విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ మూవీగా లైల మిగిలింది. ఈ సినిమా రిజల్ట్ పక్కన పెట్టి నెక్ట్స్ ప్రాజెక్టులపై సీరియస్ గా వర్క్ చేయబోతున్నాడట విశ్వక్. ప్రెజెంట్ అనుదీప్ కప్ డైరెక్షన్ లో ఫంకీ, అలాగే విశ్వక్ 13 సినిమాలను లైన్లో పెట్టాడు. వీటితో పాటు విశ్వక్ కేరిర్ లో క్లాసిక్స్ గా పిలవబడే ఫలక్ నామా దాస్ సీక్వెల్ తో పాటు యూత్ మోస్ట్ లవ్డ్ ఫిల్మ్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పై ఫోకస్ చేస్తున్నాడట ఈ మెకానిక్ రాకి. ఈ సారి ఈలాగైనా హిట్ కొట్టాలని ఇక నుండి కథల విషయంలో పక్కాగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు విశ్వక్.