రీసెంట్లీ హీరో నుండి విలన్‌గా టర్న్ తీసుకున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తనకు నేమ్, ఫేమ్ ఇచ్చిన రేస్ ఫ్రాంచైజీలోకి తిరిగి వచ్చేస్తున్నాడు. రేస్ 3లో మిస్సైన సైఫ్.. రేస్ 4లో పార్ట్ నర్ కాబోతున్నాడు. రేస్ వెంచర్‌లో భాగంగా తెరకెక్కుతోన్న ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సైఫ్‌తో పాటు మరో యంగ్ అండ్ టాలెంట్ యాక్టర్ సిద్దార్థ్ మల్హోత్రా ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతున్నారు. కొత్తగా ఈ వెంచర్‌లోకి స్టెప్ ఇన్ అవుతున్నాడు సిద్దూ.
Also Read : Adhik : ఒక్కొక్క హిట్ మూవీ నుండి ఒక్కో లుక్ కాపీకొట్టిన దర్శకుడు
ఇక ఈ డైనమిక్ హీరోలకు ఈ హీరోయిన్లే అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. ముంజాతో పాపులరైన శార్వరి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఇందులో యాక్ట్ చేయబోతున్నారని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది. ఆల్మోస్ట్ ఈ భామ కన్ఫమ్ అయినట్లు బాలీవుడ్‌లో టాక్. రీసెంట్లీ మేరీ హస్బెండ్ కీ బీవీతో పలకరించిన రకుల్ చేతిలో ప్రజెంట్ రెండు సీక్వెల్స్ ఉన్నాయి. దేదే ప్యార్ దే2, భారతీయడు3 ఉన్నాయి. ఇప్పుడు ఇది ఓకే అయితే మొత్తం ఇన్ స్టాల్ మెంట్స్ మూవీస్సే. సీనియర్ భామ రాణి ముఖర్జీ పోలీసు గెటప్‌లో మరోసారి గర్జించనుంది. ఫీమేల్ లీడ్ పోషించిన మర్దానీ సీజన్ నుండి మరో సినిమాను దింపుతోంది. హిట్ వెంచర్ మర్దానీ 3నిలో జాయిన్ అవుతోంది. మర్దానీ వన్ అండ్ 2 తెరకెక్కించిన యశ్ రాజ్ ఫిల్మ్సే మర్దానీ3ని నిర్మిస్తోంది. అభిరాజ్ మినావాలా దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటున్న ఈ ప్రాజెక్ట్ జూన్ నుండి పట్టాలెక్కనుంది.