Oscar Awards : ఐదు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఒకే సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్లో బిగ్గెస్ట్ వేడుక ఆస్కార్ అవార్డుల సందడి గ్రాండ్‌గా ఆరంభమైంది. 97వ ఆస్కార్స్ అవార్డ్స్ వేడుకలు లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్స్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక రెండేళ్ల క్రితం మన ఇండియన్ మూవీకి ఆస్కార్ వరించిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్‌కి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వరించింది. ఈ సారి ఊహించని సినిమాలకు, ఆర్టిస్టు లకు అవార్డులు వరిస్తున్నాయి. ఈ సారి కంటెంట్‌కి పెద్ద పీఠ వేస్తున్నట్టు తెలుస్తుంది.
Also Read: Sleeping : అతిగా నిద్రపోతున్నారా..?
Also Read
- Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
- Janvi Kapoor: 'పెద్ది' దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
ఇందులో భాగంగా బెస్ట్ ఫిల్మ్ క్యాటగిరి లో అనేక చిత్రాలు పోటీపడగా ‘అనోరా’ సినిమాను ఆస్కార్ 2025 ఉత్తమ చిత్రంగా ఆస్కార్ ముద్దాడింది. కాగా 97వ అకాడమీ అవార్డ్స్‌లో ‘అనోరా’ ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ను గెలుచుకోవడం మాత్రమే కాదు, ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ ఉత్తమ దర్శకత్వ విభాగం ఆస్కర్ గెలుచుకోవడంతో పాటుగా, ఈ చిత్రం మొత్తం ఐదు విభాగాల్లో గెలుపొందింది. ఈ ఏడాది 5 ఆస్కార్లు గెలుచుకున్న సినిమాగా ‘అనోరా’ చరిత్ర సృష్టించింది.
ఇక బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్న ఆనోరా దర్శకుడు సీన్ బేకర్ తన తొలి సినిమాను 2015 లో టాన్జరిన్తో ప్రారంభించాడు. ఈ మూవీని తన ఐఫోన్లో చిత్రీకరించాడు. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఆస్కార్ ను గెలుచుకున్నాడు సీన్ బేకర్. పెద్ద బడ్జెట్లు, చిత్రాలను చిత్రీకరించడానికి ఫ్యాన్సీ కెమెరాలు అక్కర్లేదు. కంటెంట్ బాగుంటే ప్రశంసలు వాటంతట అవే వస్తాయని మరోసారి నిరూపించాడు ఆస్కార్ విన్నర్ సీన్ బేకర్.
తాజావార్తలు
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!