NTV Telugu Site icon

Devara : దేవర ప్రమోషన్స్ అంతా గప్ చుప్.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..

Untitled Design (9)

Untitled Design (9)

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర  బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్  ఇప్పటి వరకు 55 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.  దేవర తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read : MathuVadalara2 : మత్తువదలరా -2 మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

ఇదిలా ఉండగా దేవర సినిమాపై ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో హద్దులు దాటిన ట్రోలింగ్ జరుగుతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుండి ఆ ట్రోలింగ్ మరింత ఎక్కవ అయింది. కానీ చిత్ర యూనిట్ సభ్యులుకాని మరెవరు కూడా ఈ ట్రోలింగ్ కు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చెయ్యట్లేదు. రిలీజ్ నాటికి ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువ అయితే అది సినిమాపై ప్రభావం చూపుతుందడంలో సందేహం లేదు. మరోవైపు దేవర తెలుగు స్టేట్స్ ప్రమోషన్స్ ను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు మేకర్స్. దీనిపై నందమూరి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. రిలీజ్ కు కేవలం 13 రోజులు ఉండగా కనీసం పోస్టర్స్ కూడా రిలీజ్ చేయట్లేదని,  సాంగ్స్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అటు హిందీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా, కపిల్ శర్మ కామెడీ షో  దేవర టీమ్ తో ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. దేవర తెలుగు ప్రమోషన్స్  ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, సినిమాను మరింతగా ఆడియన్స్ లోకి ఎలా తీసుకువెళ్తారో చూడాలి.

Show comments