Site icon NTV Telugu

Tharun Bhascker: విశ్వక్’ను పక్కన పెట్టి దేవరకొండతో తరుణ్ భాస్కర్?

Vishwaksen

Vishwaksen

పెళ్లిచూపులు అనే సినిమాతో మంచి విజయం సాధించిన తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది లాంటి మరో ఆకట్టుకునే సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఈ మధ్యలో కీడా కోలా అనే సినిమా చేశాడు, కానీ అంతకుముందే నటుడిగా మారిపోవడంతో బిజీగా గడిపేస్తున్నాడు. నిజానికి ఆయన జై జైహే అనే సినిమా రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు. మరోపక్క, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కోసం ప్రేక్షకుల నుంచి డిమాండ్ బాగా రావడంతో, ఆయన ఆ సీక్వెల్ స్క్రిప్ట్‌పై కూర్చుని చాలా కాలం క్రితం పూర్తి చేశాడు.

Read More: Sri Vishnu : ఏకంగా 3 సినిమాలు లైన్ లో పెట్టిన యంగ్ హీరో..

అయితే, విశ్వక్ సేన్ వరుస పరాజయాలతో మార్కెట్‌లో దారుణమైన పరిస్థితిలో ఉండడంతో, ఆ సినిమాను పట్టాలెక్కించడం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో, తరుణ్ భాస్కర్ విశ్వక్ సేన్‌ను పక్కనపెట్టి, పెళ్లిచూపులు కాంబినేషన్‌ను మరోసారి సెట్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండకు స్క్రిప్ట్ చెప్పి ఒప్పించాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఈ సినిమాను నిర్మించబోతోంది.

Read More:Sree Vishnu – Samantha: శ్రీవిష్ణు, సమంత’లకు గోల్డెన్ ఛాన్స్

అయితే, తరుణ్ భాస్కర్ విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ ఇద్దరి కోసం ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశ్వక్ సేన్ కూడా తలసాని కుమారుడు నిర్మిస్తున్న సినిమాను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. కాబట్టి, ఆయన కూడా ఇప్పటికిప్పుడు ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ షూట్‌కు హాజరయ్యే పరిస్థితిలో లేడు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అయితే బెటర్ అని ఆయన షిఫ్ట్ అయినట్లు చెబుతున్నారు.

Exit mobile version