నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన తాజా మూవీ తండేల్. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి కలెక్షన్స్ వర్షం కూడా కురుస్తుంది. శుక్రవారంతో పాటు శనివారం, ఆదివారంతో పాటు సోమవారం కూడా సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా గట్టిగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
Funmoji: వెండితెరపైకి ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్.. ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ సినిమా ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 73 కోట్ల 20 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈరోజు కూడా వసూళ్లు స్టడీగా కొనసాగి రేపు కూడా కొంత గట్టిగా వసూళ్లు లభిస్తే 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ధియేటర్లకు కదిలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాయి పల్లవి నాగ చైతన్య నటనతో పాటు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకి మంచి అసెట్ గా నిలుస్తోంది.