టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఖాతాలోకి ఇంకొక సినిమా చేరింది. అఖండ ఘనవిజయం సాధించడంలో థమన్ పాత్రే ఎక్కవ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు థమన్ ని వెత్తుకుంటూ వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం తమని భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, మహేష్- త్రివిక్రమ్ కొత్త సినిమా ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన థమన్ మరో సినిమాకు బీజీఎమ్ అందించనున్నాడు.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్ర ‘డీజే టిల్లు’. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ పెంచేసిన మేకర్స్ టైటిల్ సాంగ్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ అందిస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. బీజీఎమ్ కొట్టడంలో థమన్ ని మించి తోపు లేరు అని అభిమానులు బల్లగుద్ది చెప్తున్న తరుణంలో ఈ సినిమాకు థమన్ బీజీఎమ్ అనేసరికి ఒక్కసారిగా అంచాలను రెట్టింపు అయ్యాయి. మరి థమన్ బీజీఎమ్ ఈ సినిమాకు ఎలాంటి హెల్ప్ అవుతుందో చూడాలి.