Thaman – Anirudh: చేతులు కలిపిన సౌత్ సెన్సేషన్స్.. థమన్ మ్యూజిక్‌లో అనిరుధ్ ఊరమాస్ సాంగ్!

Thaman Anirudh

Thaman Anirudh

Thaman – Anirudh: సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు థమన్ ఎస్, అనిరుధ్ రవిచందర్ కలిసి ఒకే ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

ఈ క్రేజీ కోలాబరేషన్‌కు సంబంధించి థమన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అనిరుధ్‌ను ట్యాగ్ చేస్తూ.. “బ్రదర్… ఇక మొదలుపెడదామా?” అంటూ పోస్ట్ చేశారు. దీనికి అంతే ఎనర్జిటిక్‌గా స్పందించిన అనిరుధ్.. “నేను రెడీ… సాయంత్రం 6:03కి స్టార్ట్ చేద్దాం” అంటూ రిప్లై ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ ఇద్దరు స్టార్ మ్యూజిక్ సెన్సేషన్స్ చేతులు కలిపింది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం #SVC63 కోసం అని సమాచారం. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు భాగం అవుతున్నట్లు ప్రస్తుతం సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనిరుధ్ ఒక మాస్ సాంగ్ పాడబోతున్నారని చెబుతున్నారు. థమన్ – అనిరుధ్ కలిసి క్రియేట్ చేయబోయే ఆ మ్యూజికల్ మ్యాజిక్ కోసం ఇటు సినిమా ప్రేమికులు, అటు సంగీతాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#SVC63 విషయానికి వస్తే..
బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా #SVC63. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్‌ను 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్ – అనిరుధ్ కలిసి పని చేయబోతున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.