తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో చిత్ర పరిశ్రమనుండి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు.
Also Read : SIIMA 2024: బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అవార్డు అందుకున్న ‘చిన్న కొండ’
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. KVN ప్రొడక్షన్స్ లో విజయ్ నటించబోయే ఈ సినిమాకు గాను కెరీర్ హయ్యెస్ట్ పారితోషకం అందుకోనున్నాడట KVN ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా కోసం విజయ్ కు అక్షరాలా 275 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వనుందట. ఈ స్థాయి రెమ్యునరేషన్ ను ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా తీసుకోలేదు. మరోవైపు హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అవెంజర్స్ లో ఐరన్ మ్యాన్ గా నటించిన రాబర్ట్ డౌనీ ఎండ్ గేమ్ సినిమాకు రూ. 160 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు 69 వ సినిమాకు విజయ్ హాలీవుడ్ నటుడిని మించిన రెమ్యునరేషన్ తో రికార్డు సృష్టించాడు. H. వినోద్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను దాదాపుగా రూ. 650 – 700 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుంది KVN నిర్మాణ సంస్థ. ఇటీవల విడుదలైన విజయ్ GOAT సినిమాకుగాను రూ. 200 కోట్లు పారితోషకం తీసికున్నాడు ఈ తమిళ హీరో.