కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రం ‘వాలిమై’. ‘వాలిమై’ పోలీస్ యాక్షన్ డ్రామా. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు, సుమిత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. దాదాపు గత రెండు సంవత్సరాలుగా వాలిమై’ అప్డేట్ గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అజిత్ అభిమానులు. తాజాగా ఈ సినిమా నిర్మాత బోనీ కపూర్ త్వరలో అప్డేట్ ఇస్తారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా నేడు ట్విట్టర్ లో #ValimaiFirstLook అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Read Also : “పఠాన్” షూటింగ్ తిరిగి ప్రారంభించిన కింగ్ ఖాన్
ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘వాలిమై’ ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర ప్రమోషన్లను వాయిదా వేశారు మేకర్స్. తాజా గాసిప్స్ ప్రకారం నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారట. ‘వాలిమై’ ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదల తేదీని వచ్చే నెలలో ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఇటీవల ‘వాలిమై’ గురించి ట్విట్టర్ స్పేసెస్ సెషన్‌లో మాట్లాడుతూ ఈ చిత్రంలో తల్లులకు అంకితం చేసిన పాట ఉంటుందని వెల్లడించారు.