Site icon NTV Telugu

Dil Raju : ఫెడరేషన్‌తో చివరి దశ చర్చలు!

Dil Raju Interview

Dil Raju Interview

తెలుగు సినీ పరిశ్రమలోని వేతన పెంపు సమస్యల పరిష్కారం కోసం ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, మరియు నిర్మాతల మధ్య ముఖ్యమైన చర్చలు మొదలయ్యాయి. ఈ సమావేశం పరిశ్రమలో సాంకేతిక, ఆర్థిక, నిర్మాణ సమస్యలపై దృష్టి సారించింది. ఈ చర్చల్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ ఛైర్మెన్ వీరశంకర్, ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్, ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బాజీ, మహిళా ప్రొడక్షన్ నాయకురాలు లలిత తదితరులు పాల్గొన్నారు.

Also Read:Manchu Lakshmi: ముగిసిన మంచులక్ష్మీ ఈడీ విచారణ.. ఈ మూడున్నర గంటలు ఏం జరిగింది..?

నిర్మాతల తరఫున భోగవల్లి బాపినీడు, ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ, జెమిని కిరణ్, వివేక్ కూచిభట్ల హాజరయ్యారు. ఈ సమావేశంలో సినీ నిర్మాణ వ్యయాలు, కార్మికుల సంక్షేమం, సాంకేతిక ఆధునీకరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. దిల్ రాజు మాట్లాడుతూ, పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి అన్ని వర్గాల సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ చర్చలు తెలుగు సినిమా పరిశ్రమకు కొత్త దిశానిర్దేశం చేసే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా వేతన పెంపు పేరుతొ సినీ షూటింగ్స్ నిలిచిపోయాయి. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది చూడాలి.

Exit mobile version