నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనూహ్య కారణాలతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన ‘అఖండ-2’ సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టిక్కెట్ ధరల పెంపునకు తాత్కాలికంగా అనుమతి మంజూరు చేసింది. హోమ్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన మెమో (సంఖ్య: 6593-P/General.A1/2025; తేది: 10-12-2025) ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నిబంధనలు/మార్గదర్శకాలను సడలించి ఈ పెంపుదలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ టిక్కెట్ ధరల పెంపు డిసెంబర్ 12, 2025 నుండి డిసెంబర్ 14, 2025 వరకు (మొత్తం మూడు రోజులు) వర్తిస్తుంది.
Also Read :Bhartha Mahasayulaku Wignyapthi : అద్దం ముందు రవితేజ ‘విజ్ఞప్తి’!
* సింగిల్ స్క్రీన్‌లు: ప్రస్తుత టిక్కెట్ ధరపై అదనంగా ₹ 50/- (GST తో సహా) పెంచడానికి అనుమతి లభించింది.
* మల్టీప్లెక్స్‌లు: ప్రస్తుత టిక్కెట్ ధరపై అదనంగా ₹ 100/- (GST తో సహా) పెంచడానికి అనుమతి ఇచ్చారు.
* ప్రత్యేక షో: డిసెంబర్ 11, 2025 న రాత్రి 8.00 గంటలకు వేసే ఒక షోకి టిక్కెట్ ధర *₹ 600/-*గా (GST తో సహా) నిర్ణయించబడింది.
Also Read :Akhanda 2: మళ్లీ ఆందోళనలో బాలయ్య అభిమానులు.. అఖండ 2 ఉంటుందా? లేదా?
ఈ ఉత్తర్వులో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ పెంచిన ధరల ద్వారా థియేటర్లకు వచ్చే అదనపు ఆదాయంలో 20% (ఇరవై శాతం) మొత్తాన్ని తప్పనిసరిగా సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి. ఈ మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అకౌంట్‌కు జమ చేయబడుతుంది. ఈ నిధి నిర్వహణ కోసం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ద్వారా, కార్మిక కమిషనర్‌తో సంప్రదించి ఒక ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిజానికి ఏపీ నుంచి జీవో జారీ అయ్యాక కూడా తెలంగాణ నుంచి జీవో జారీ కాకపోవడంతో తెలంగాణ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు జీవో జారీ అవుతుందో అని ఆసక్తికరమైన ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ జీవో జారీ అయింది. మరి కొద్ది సేపట్లో తెలంగాణ వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది.