Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?

Lakshmi Soujanya

Lakshmi Soujanya

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని వెండితెరపై నటిగా పరిచయం కాబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఒక పవర్‌ఫుల్ ఫీమేల్ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ డ్రామా ద్వారా నటిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరి దర్శకత్వంలో తేజస్విని ఎంట్రీ ఇస్తుందనేది క్లారిటీ లేదు.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘వరుడు కావలెను’ చిత్రంతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తేజస్విని నటిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇటీవల తేజస్వినిని ప్రత్యేకంగా కలిసి తేజస్వినితో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసిన లక్ష్మి సౌజన్య.. “నందమూరి తేజస్విని కలవడం చాలా సంతోషంగా ఉంది. మళ్లీ కలవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో తేజస్విని నటిగా ఎంట్రీ ఇచ్చే డెబ్యూ మూవీకి లక్ష్మి సౌజన్యనే దర్శకత్వం వహించబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.