చిన్నతనంలోనే వెండితెరపై అడుగుపెట్టి నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఇప్పుడు హీరోగా ఓ మైల్ స్టోన్ అందుకున్నారు. చూడాలని వుంది, రాజకుమారుడు, కలిసుందాం రా, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా తన ప్రతిభను చాటిన తేజ, 2005లో బోన్సాయ్ చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఇప్పుడు హీరోగా కూడా అదే స్థాయిలో మెరుస్తున్నారు. హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజ, ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు.
Also Read: Uppu Kappurambu: ఉప్పు కప్పురంబు ట్రెయిలర్.. ఇదేదో బానే ఉందే!
తాజాగా, తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2024 మధ్య కాలంలో విడుదలైన చిత్రాలకు గద్దర్ సినీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2023 సంవత్సరానికి గాను తేజసజ్జా హీరోగా నటించిన హనుమాన్ ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపికై అవార్డు సాధించింది.దీంతో రాష్ట్రాల ప్రభుత్వాలు నుంచి బాల నటుడిగా, హీరోగా అవార్డ్ లని అందుకున్న నటుడిగా ఓ స్పెషల్ మైల్ స్టోన్ ని క్రియేట్ చేశారు. తేజ నుంచి రాబోతున్న ‘మిరాయ్’ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. హనుమాన్ తర్వాత తేజ చేస్తోన్న ఈ సూపర్ హీరో చిత్రం ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి రేపుతోంది.
