Aha : ఆహాలో దూసుకుపోతోన్న ‘టీనేజర్స్ 17/18’
- ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్‌గా ‘టీనేజర్స్ 17/18’
- సెప్టెంబర్ 21 ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న టీనేజర్స్ 17/18
- మిలియన్ల మినిట్ వ్యూస్‌తో రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్‌గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగు ఆడియెన్స్‌కి ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. యథార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంంటుంది. యూత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించారు. ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు ఈ చిత్రం వచ్చేసింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. హనుమాన్ మీడియా మీద నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకొచ్చారు.
మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులను సాధించింది. పృథ్వీ కొననూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు. ఇక ఈ చిత్రంలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇక ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అర్దరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతున్నా.. ఇప్పటికే మిలియన్ల మినిట్ వ్యూస్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే ఆహాలో ఈ సినిమా టాప్ 4 లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ఆహాలో ట్రెండ్ అవుతోంది. వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ‘టీనేజర్స్ 17/18’ చూస్తూ ఎంజాయ్ చేసేయండి.
Also Read
- Tags
- #FilmNews
- Aha
- cinemanews
- OTT
- Tollywood
తాజావార్తలు
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..