‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. ఫహద్ ఫాసిల్ మలయాళ హీరో కావడంతో ఆయనకు తెలుగు అస్సలు రాదు. అందుకే ఆయన పాత్రకు టాలీవుడ్ లోని ఓ యంగ్ హీరోతో డబ్బింగ్ చెప్పించాలని భావిస్తున్నారట మేకర్స్. ఇటీవల ఫహద్ ఫాసిల్ హీరోగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ “అనుకోని అతిథి” తెలుగులో విడుదలైంది. ఆ చిత్రంలో ఫహద్ పాత్రకు యంగ్ హీరో తరుణ్ తో డబ్బింగ్ చెప్పించారు. ఫహద్ పాత్రకు తరుణ్ చెప్పిన డబ్బింగ్ కరెక్ట్ గా సరిపోవడంతోపాటు మంచి స్పందన వచ్చింది. అందుకే “పుష్ప”లో కూడా ఫహద్ పాత్రకు తరుణ్ తోనే డబ్బింగ్ చెప్పించాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’కు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.