తమిళ సూపర్ స్టార్, తలపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. విజయ్ తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడంతో ఆయన కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిలా నిలిచేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా… తాజాగా విజయ్ రెమ్యూనరేషన్ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ విజయ్ రూ.80 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడు. అయితే దిల్ రాజు ఈ చిత్రానికి విజయ్ కు అంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేశాడట. ఒకవేళ ఈ చిత్రానికి విజయ్ కు పారితోషికంగా 80 కోట్ల నుండి 90 కోట్లు ఇచ్చినా ఈ చిత్రం మొత్తం బడ్జెట్ 160 కోట్లకుపైగానే అవుతుంది. ఇక వంశీ పైడిపల్లి సోషల్ మెసేజ్ ఉన్న మంచి సినిమాలను తీయగలడు. కానీ ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి, మహర్షి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించినా… కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. మరి ఇప్పుడు వంశీ పైడిపల్లి, విజయ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి దిల్ రాజు ఎంత ఖర్చు పెడతాడో చూడాలి. దిల్ రాజు ఇటీవలే ‘వకీల్ సాబ్’తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.