Site icon NTV Telugu

Producers Council: మీరు అనుకుంటే సరిపోద్దా.. హీరోలూ అనుకోవాలిగా!

Kollywood

Kollywood

నిన్న తమిళ సినీ నిర్మాతల మండలి (తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) చెన్నైలో ఉన్న కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. అంతేకాక, ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళ సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జనరల్ బాడీ తెలిపింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారు తీసుకున్న నిర్ణయాలు బానే ఉన్నాయి, కానీ వాటిని కేవలం నిర్మాతలు అనుకుంటే సరిపోదు, హీరోలు కూడా అనుకుంటేనే అది వర్కవుట్ అవుతుంది.

Also Read:Mohan Bhagwat: పాకిస్థాన్‌కు నష్టం కలిగేలా భారత్‌ ఓడించాలి..

ముఖ్యంగా, ఇక మీదట చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ రెవెన్యూ షేరింగ్ మోడల్లోనే ఉండాలని ప్లాన్ చేశారు. అంటే, దీని ప్రకారం స్టార్ హీరోలు, టెక్నీషియన్లు ఫుల్ పేమెంట్లు తీసుకోరు, కానీ సినిమా పూర్తి అయిన తర్వాత వచ్చే లాభాన్ని లేదా నష్టాన్ని మాత్రమే షేర్ చేసుకుంటారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, శివ కార్తికేయన్, ధనుష్, విక్రం, శింబు, విశాల్ లాంటి హీరోలను ఈ కొత్త స్ట్రక్చర్కి సహకరించాలని కోరుతున్నారు. అలాగే, థియేటర్లో నుంచి వచ్చే రెవెన్యూ కూడా కాపాడేందుకు ఓటీటీ స్ట్రీమింగ్ విండోని పెంచాలని భావిస్తున్నారు.

Also Read:Peddi : ‘పెద్ది’తో నా కల నెరవేరింది.. రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్

ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వారాల విండో ఉంది. దాన్ని 6 నుంచి 8 వారాలకు పెంచాలని భావిస్తున్నారు. పెద్ద సినిమాలకు ఎక్కువ గ్యాప్ ఉండేలా, చిన్న సినిమాలకు కొంత తక్కువ ఉండేలా ప్లాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే, బుక్ మై షో లాంటి యాప్స్ కాకుండా, తమిళనాడు గవర్నమెంటు స్వయంగా ఒక టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారం ఓపెన్ చేస్తే మంచిదని ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, ఏడాదికి 250 చిన్న, మధ్యతరహా సినిమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ చేసేందుకు ఫిలిం రిలీజ్ రెగ్యులేషన్ కమిటీ ఒకదాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

Exit mobile version