NTV Telugu Site icon

Odela 2 : అక్కడ కూడా ‘ఓదెల 2’ను ప్రమోట్ చేయనున్న తమన్నా

Odhela2

Odhela2

డైరెక్ట్ OTT లో విడుదలై త్రిల్లింగ్ మూవీగా ఆకట్టుకున్న చిత్రం ‘ఓదెల రైల్వేస్టేష‌న్’. 2022 లో వచ్చిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్ర పోషించగ కథ ప్రకారం ప్రేక్షకును ఈ మూవీ ఎంతో ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్‌గా ‘ఓదెల‌-2’ వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్‌ సంప‌త్ నంది క‌థ అందించ‌డంతో పాటు నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Also Read: AI Movie: మొదటి భారతీయ ‘ఏఐ’ మూవీ పరిచయం చేసిన చిత్రబృందం.

ఇటివల ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ మ‌హాకుంభ మేళాలో విడుద‌ల చేయగా, ఇందులో త‌మ‌న్నా లేడీ అఘోరాగా క‌నిపించింది. ఉత్కంఠ రేకేత్తించే స‌న్నివేశాల‌తో ప్రతి ఒక సీన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ టీజ‌ర్ అధిరిపొయింది. యూట్యూబ్ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో తమన్నా బాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ సంపాదించుకుంది. అక్కడ వరుస చిత్రాలు, సిరీస్ లు.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ క్రేజ్ ని ‘ఓదెల 2’ కి ఉపయోగించుకోనుంది తమన్నా.

ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ‘ఓదెల 2’ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఈ సినిమాను హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం హిందీ రైట్స్ ఏకంగా రూ.8 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. కాగా బాలీవుడ్‌లో ఈ మూవీని తమన్నా ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతుందట. అక్కడ ఆమెకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్‌ను ఈ సినిమా కోసం వినియోగించుకోనున్నారట.