ఈ మధ్యకాలంలో తమన్నా, విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి, ఆ తరువాత బ్రేకప్ చెప్పి ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తన పాస్ట్ రిలేషన్ గురించి ఆమె పరోక్షంగా చేసినట్లుగా ఉన్న కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె దేని గురించి మాట్లాడింది అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ, ఆమె పాస్ట్ రిలేషన్ గురించే మాట్లాడి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.
Also Read :SSMB 29: టైటిల్ చెప్పేస్తున్నారు గెట్ రెడీ
తన విషయంలో హానెస్ట్‌గా లేకపోవడం అనేది అస్సలు సహించలేనని ఆమె అంటుంది. ఒక మర్డర్ చేసి వస్తే నేను సాయం చేస్తాను. కానీ, అబద్ధం చెబితే మాత్రం తట్టుకోలేనని చెబుతోంది. ఒక రిలేషన్‌లో కంఫర్ట్ కన్నా నిజమే ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె రిలేషన్ గురించి మాట్లాడింది కాబట్టి, వెంటనే విజయ్ వర్మతో రిలేషన్ గురించి ఫ్యాన్స్ ఆమె మాట్లాడి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఆమె విజయ్ వర్మతో రిలేషన్ గురించే మాట్లాడిందనే చెప్పలేం. కానీ, ఈ మేరకు ప్రచారం అయితే మొదలైంది.