Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’

Takshaka

Takshaka

టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలకు, వినూత్నమైన కాన్సెప్ట్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవలోనే మైథాలజీ, హై-ఎండ్ సైన్స్ ఫిక్షన్‌ ఎలిమెంట్స్ కలబోసి తెరకెక్కిస్తున్న సరికొత్త విజువల్ డ్రామా “తక్షక”. మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ఎంఎస్ఆర్ క్రియేషన్స్’ బ్యానర్‌పై డా. లతా రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ఆమె కుమారుడు కుశాల్ రాజు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా అత్యంత ఘనంగా లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. “మల్లిడి సత్యనారాయణరెడ్డి కుటుంబంతో నాకు ఎప్పటి నుంచో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. వారి అబ్బాయి కృష్ణ మల్లిడి ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతుండటం చాలా సంతోషంగా ఉంది. తనకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన నిర్మాత లతా రాజు గారికి నా ధన్యవాదాలు. ఆమె అబ్బాయి కుశాల్ రాజు ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ సాధించి.. కుశాల్ మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలని, మా కృష్ణ ఇండస్ట్రీలో పెద్ద కమర్షియల్ డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని బెస్ట్ విషెస్ అందించారు.