టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒకవైపు స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే మరోవైపు చిన్న- మధ్య తరహా బడ్జెట్‌లతో మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ థీమ్ పోస్టర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ అందించారు.
Read Also : కొత్త మూవీకి తేజ సజ్జ షాకింగ్ రెమ్యూనరేషన్…!!?
‘ఝుమ్మంది నాదం’ మూవీతో 2010లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన తాప్సీ పన్ను… ఇప్పుడు ఎక్కువగా హిందీ చిత్రాలపైనే ఫోకస్ పెట్టింది. తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తోంది. ‘ఆనందో బ్రహ్మ, నీవెవరో, గేమ్ ఓవర్’ వంటి సినిమాలలో ఆ మధ్య నటించింది. ఆ తర్వాత స్ట్రయిట్ తెలుగు సినిమాలో చేయలేదు. అయితే తాజాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో లీడ్‌రోల్‌లో ఆమె నటిస్తోంది. మంగళవారం నుండి ఈ సినిమా షూటింగ్ లో ఆమె పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు యూనిట్ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అంతేకాదు… చేతికి కట్టుతో ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియస్‌గా చూస్తున్న వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తాప్సీ పన్ను మాట్లాడుతూ – గత 7 సంవత్సరాలుగా ఒక ప్రేక్షకుడిగా నన్ను తెరపై ఎలా చూడాలని అనుకుంటాడో అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. దాని కోసం నేను నా సమయాన్ని, డబ్బును ఖర్చు చేశాను. 'మిషన్ ఇంపాజిబుల్' అలాంటి చిత్రాల్లో ఒకటి. ఆకట్టుకునే కథాంశంతో పాటు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి మంచి టీమ్ లభించడం ఆనందంగా ఉంది. క్వాలిటీ చిత్రాలను ఎన్నుకోవడంలో ప్రేక్షకులు నాపై ఉంచిన నమ్మకాన్ని, ఇలాంటి సినిమాలలో భాగం కావడం ద్వారా నేను ఖచ్చితంగా నిలబెట్టుకోగలనని నమ్ముతున్నాను
అని తాప్సీ తెలిపింది.
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్. ఎం. పాష అసోసియేట్ ప్రొడ్యూసర్. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్, మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు, రవితేజ గిరిజల ఎడిటర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.