Site icon NTV Telugu

Phoenix: తెలుగులోకి విజయ్ సేతుపతి కొడుకు సినిమా

Surya Sethupathi,vijay Sethupathi

Surya Sethupathi,vijay Sethupathi

తమిళ సినిమా పరిశ్రమలో ‘మక్కల్ సెల్వన్’గా పిలవబడే విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఫీనిక్స్’ ఇటీవల తమిళంలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు డబ్బింగ్ వెర్షన్‌గా రానుంది. ఈ సందర్భంగా రేపు (ఆగస్టు 9, 2025) తెలుగు డబ్బింగ్ వెర్షన్ టీజర్ విడుదల కార్యక్రమం జరగనుంది, ఈ కార్యక్రమంలో సూర్య సేతుపతి మీడియాతో ముచ్చటించనున్నారు.

Also Read :TFCC: తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన

‘ఫీనిక్స్’ ఒక హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామా, ఇది ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా అనల్ అరసు దర్శకుడిగా తొలి సినిమా. సూర్య ఈ చిత్రంలో ఒక యువ రెజ్లర్‌గా కనిపించనున్నారడు. ఇంకా ఈ సినిమాలో రలక్ష్మీ శరత్‌కుమార్, సంపత్ రాజ్, దేవదర్శిని, అభినక్షత్ర, వర్ష విశ్వనాథ్, మరియు ‘కాకా ముట్టై’ ఫేమ్ విఘ్నేష్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. సామ్ సిఎస్ సంగీతం, వెల్రాజ్ సినిమాటోగ్రఫీ, మరియు ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ ఈ చిత్రానికి సాంకేతిక బలాన్ని అందించాయి.

Also Read :Tirupati: అరే పవన్ నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను.. దయచేసి ఫోన్ చేయరా..!

ఏకె బ్రేవ్‌మన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజలక్ష్మీ అరసకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఫీనిక్స్’ జులై 4, 2025న తమిళంలో థియేటర్లలో విడుదలైంది. మొదట నవంబర్ 14, 2024న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి కొన్ని కట్స్ కారణంగా విడుదల వాయిదా పడింది. విడుదలైన తర్వాత, సినిమా సాంకేతిక నాణ్యత, సూర్య సేతుపతి నటనకు విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు అందుకుంది, సూర్య తన పాత్ర కోసం 120 కిలోల బరువు నుండి ఒకటిన్నర సంవత్సరాలలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) నేర్చుకున్నాడు.

Exit mobile version